విమర్శలు గుప్పించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం
పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
వరంగల్ ఎల్కతుర్తిలో కెసిఆర్ నిర్వహించేది రజతోత్సవ సభ కాదని, అది గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కెసిఆర్ చేసిన మోసాలను కప్పిపుచ్చుకునే కుతంత్రోత్సవ సభని.. పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆరోపించారు. ఈనాటి సభలో కెసిఆర్ ప్రజలకు ఏం చెబుతారో, దళితులకు మూడెకల భూమి ఎకరాల భూమి ఇచ్చామని చెబుతారా, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెబుతారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉండి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే పడుకుంటానని చెబుతాడా అని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించిన తొమ్మిది సంవత్సరాలు కాలం రావణాసురుడి పాలన సాగించాడని, కూతురు కొడుకు అల్లుడుకే పదవుల పట్టం కట్టాడని, కెసిఆర్ ని మించిన పనికిమాలిన ముఖ్యమంత్రిని చరిత్రలోనే చూడలేదని గొడిశాల దుయ్యబట్టారు. వరంగల్ సభకు 10 లక్షల మంది హాజరవుతున్నారు అని చెబుతున్న కేసిఆర్, ఈ సభ ఏర్పాట్లకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చెబుతారా అని ప్రశ్నించారు. కట్టిన సంవత్సరం కాలంలోనే కూలిపోయిన కాలేశ్వరం కాలంలోనే కృంగిపోయిన కాలేశ్వరం, కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి చెబితే తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకుంటారని అన్నారు. మాయల మరాఠీ వేషాలు ఎన్ని వేసిన కేసిఆర్ ను గానీ కెసిఆర్ తొత్తులను గాని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజల మభ్యపెట్టి ధనము మందు ఆశ చూపించి తీసుకెళ్లినారు తప్ప, బిఆర్ఎస్ పార్టీని చూసి ఎవరు రాలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా సమాధిలో కూరుకు పోతుందని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కెసిఆర్ కెసిఆర్ అల్లుడు కొడుకు కూతురు ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయాలు చేయాలని, లేకుంటే కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకుని ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లోనే శేష జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బసీరుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వతంత్ర రెడ్డి, కొంపెల్లి నాగేష్, మనోజ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ లో పనిచేయుటకు మండలాల వారీగా విలేకర్లు కావలెను
ఐడి కార్డు కు ఎలాంటి పేమెంట్ చెల్లించాల్సిన పని లేదు.
ఆసక్తి కలవారు సంప్రదించండి: 8886774046
కాళీ ఉన్న మండలాలు....
మణుగూరు
అశ్వాపురం
బూర్గంపాడు
భద్రాచలం
దుమ్ముగూడెం
చర్ల
గుండాల
ఆళ్ళపల్లి
إرسال تعليق