అశ్వాపురం: చికెన్లో పురుగుల కలకలం....

 


ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన......


అశ్వాపురం మండలం మొండికుంట రమేష్ చికెన్ షాప్ లో.....


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:--మండల పరిధిలో గల మొండికుంట గ్రామంలో గత రాత్రి రమేష్ చికెన్ షాపు నందు ఒక వ్యక్తి చికెన్ కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్లి వండుకుందాం అనే తరుణంలో దాంట్లో పురుగులు రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు . వెంటనే అదే షాప్ కాడికి వెళ్లి అడగగా చికెన్ వా తీసుకొని డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగింది. చికెన్ షాప్ వారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఎంతవరకు సబబు అని ప్రజలు తీవ్ర అవరోపణలు చేస్తూ సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  క్వాలిటీ కంట్రోల్ అధికారులు అసలు ఎక్కడ ఉన్నారు? మండలంలో ఉన్నారా లేరా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి? ఇప్పటికైనా సంబంధం శాఖ అధికారులు చర్యలు చేపట్టి ప్రజా ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నారు.







Post a Comment

కొత్తది పాతది