కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో విద్యుత్ షాక్‌కు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వరి పొలానికి నీళ్లు మోటర్ ద్వారా సరఫరా చేస్తుండగా చందా ప్రసాద్ (30) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి