భద్రాద్రి: మానవత్వమా పేగు బంధానికి ఆసరా ఇవ్వవా...


 వింత వ్యాధితో బాధపడుతున్న 2 ఏళ్ల  పాప... 


తలలో నీరు చేరి ఉబ్బిన వైనం...


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

రెండేళ్ల  ఈ పాపని చూసిన ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోయే హృదయ విధారగాధ.... పసితనంలోనే పాపకి ఆ దేవుడు వింత వ్యాధిని ఇచ్చాడనే చెప్పాలి. మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలోని ఏనిక శాన్వికి జన్మించిన మూడు నెలల తర్వాత తలలో నీరు చేరి ఉబ్బడం మొదలైంది. 


ఫోటోలు చూస్తే  ఎంతలా ఉందో అర్థం అవుతుంది. ఆ తల్లిదండ్రులకు  మహాలక్ష్మి పుట్టిందన్న ఆనందం ఎన్నాళ్లో లేదు. కొండంత బాధతో నిండిన ఆ హృదయాలు మానవత్వం చాటుకోవాలని కోటి దండాలు పెడుతున్నాయి. దయార్థ హృదయాల కోసం వేచి చూస్తున్నాయి.  పేగు బంధాన్ని కాపాడుకోవాలని వారి గుండె రోదిస్తుంది. కూలీ పనికి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళే బ్రతుకులు వారివి. పాపని ఆసుపత్రిలో చూపించగా డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయించే సోమత లేక ఎవరిని అడగాలో అర్థం కాక వేడుకుంటున్నారు

ప్రభుత్వమో, స్వచ్ఛంద సంస్థ వారో ఎవరైనా ముందుకు వస్తారని ఆశతో... వేచి చూస్తున్నారు. మానవత్వం చాటుకుందాం మన వంతు తోచిన సహాయం చేద్దాం... ఫోన్ పే నంబర్:7730069986  కారం  హర్ష వర్ధన్


Post a Comment

కొత్తది పాతది