కూలీల ఆటో కారు ఢీ పలువురికి తీవ్ర గాయాలు

 


ఏటూరునాగారం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి 163 పై రోడ్డు ప్రమాదం.


 కూలీల ఆటో కారు ఢీ కొన్నాయి.


ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు. 


ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ఐదుగురికి తీవ్ర గాయాలు. 


బ్రతుకుతెరువు కోసం ఒడిశా నుంచి వరి నాట్లకు వలస వచ్చిన కూలీలు.


కారులో ప్రయాణిస్తున్న వారు జిల్లాలోని నూగూరు వెంకటాపురం మండలం ఆలుబాకకు చెందిన వారు.


గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

కొత్తది పాతది