భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
- సర్కార్ దవాఖానాలో ఐఏఎస్ సతీమణి ప్రసవం
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నది ఆనాటి ప్రభుత్వ ఆసుపత్రుల దైన్యస్థితిపై ఓ సినీ గేయ రచయిత రాసిన పాత పాట అది. నేడు ఈ పాటకు పదాలు మారాయి.స్వరం కూడా మారింది. సామాన్యుల నుంచి, ఐఏఎస్ ల వరకు ప్రభుత్వ దవాఖానాకు పయనం కడుతున్న రోజులు వచ్చేసాయి. ఇది పచ్చి నిజం. ఇందుకు సజీవ సాక్ష్యం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఐటీడీఏ పీవో రాహుల్ సతీమణి మనీషా రాహుల్ పురుడు పోసుకుంది. కచ్చితంగా ఆగస్టు 15 రోజునే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.పిఓ రాహుల్ తండ్రి అయ్యారు.ఈ చూడాముచ్చటైన సంఘటన తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే....
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతానికే పెద్దదిక్కు.ప్రసవాల విషయంలో ఆసుపత్రికి పెద్ద రికార్డే ఉంది. ఇది మూడు రాష్ట్రాల పేదోళ్ల పెద్ద ఆసుపత్రి. ఇక్కడ ప్రతిరోజు ఓపి పెద్ద సంఖ్యలోనే ఉంటుంది. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పేదల నుంచి, పెద్దల వరకు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం
కామెంట్‌ను పోస్ట్ చేయండి