పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ములుగు జిల్లా ప్రజాప్రతినిధికి కూడా కోట్ల రూపాయలు ఇచ్చాను...
వర్కులు (సీ సీ రోడ్లు, ప్రభుత్వ బిల్డింగ్స్ ) తెచ్చాను...
బహిర్గతంగానే చెప్పుకుంటూ తిరుగుతున్నాడు...
జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం
పినపాక మండల అధ్యక్షులు- కొమరం శీను,ప్రధాన కార్యదర్శి కుర్సం సారయ్య
సబ్ కాంట్రాక్టర్లారా... అధికారికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్లకు 1/2 % పర్సంటేజ్ కమిషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం లో ఒక మండల స్థాయి అధికారికి ఇస్తున్నానని బంపర్ ఆఫర్లు ఇస్తున్న బుల్లితెర బడా కాంట్రాక్టర్ అని కొమరం శీను ఒక ప్రకటనలో అన్నారు.
అత్యధికంగా ఆదివాసీలు నివసించే ఏజెన్సీ ప్రాంతాలే ఇతని టార్గెటా..?
నేను బడా కాంట్రాక్టర్ ను నాకు డబ్బు, రాజకీయ పలుకుబడి
ఒక అధికార పార్టీతోనె కాదు...
ప్రతిపక్ష పార్టీతోనైనా...
ఇతర ఏ పార్టీలతోనైనా...
నాకు సత్సంబంధాలు ఉన్నాయి అనే బలుపు తో నాసిరికమైన పనులు చేసినా ఏజెన్సీలో ఎవడేమీ అడగలేడని ధీమా తో ఇష్టం వచ్చినట్లు సీ సీ రోడ్లు పోఇస్తున్నాడన్నారు.ప్రశ్నించే ఆదివాసీ సంఘ నాయకులు పై కేసులు పెడతానని అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ తిరుగుతున్నాడన్నారు.కేసులు పెడతాననె ఆలోచన మానుకొని, నాణ్యతతో కూడిన పనులు చేస్తే మంచిదనీ పేర్కొన్నారు.లేదంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయినా...
ములుగు జిల్లా అయినా... తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా అయినా...నీ నాసిరకం పనులను జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం న్యాయపోరాటంతో... అడ్డుకుంటుంది ఖబర్దార్ బుల్లితెర బడా కాంట్రాక్టర్ అని హెచ్చరించారు.ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఇలాంటి నాసిరకం పనులు చేసే బుల్లితెర కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటారా.!? లేక ఈ నాసిరకం పనులు చేసే బుల్లితెర కాంట్రాక్టర్ ఇలాగే కొనసాగుతాడా.!?అని అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి