భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం – ఇద్దరు అరెస్ట్

 


భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.10.73 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో గంజాయితో పాటు ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

కొత్తది పాతది