మేడారం జాతరలో ఉద్రిక్తత.. భక్తులపై పోలీసుల దాడి, ఆలయ పరిసరాల్లో ఆందోళన

 



ములుగు జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భక్తులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారని ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతమందిని బలవంతంగా తరలించి దాడి చేశారని భక్తులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఆగ్రహంతో కొందరు భక్తులు పోలీసులపై చెప్పులు విసిరారు. పోలీసుల వ్యవహార శైలిపై సమ్మక్క ఆలయం వద్ద భక్తులు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

Post a Comment

కొత్తది పాతది