షార్ట్ సర్క్యూట్ కిరాణా షాప్ దగ్ధం... బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

 

మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా....


మణుగూరు మండలం సమితి సింగారం గ్రామం బస్ డిపో ఏరియాకి చెందిన.. బోలగాని సమ్మక్క చిన్న కిరణా షాప్ పెట్టుకొని కుటుంబాన్ని నడిపిస్తున్నది నిన్న రాత్రి దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి షాపులో గల సామాన్లు మరియు నిత్యవసర సరుకులు అన్ని బూడిదైపోయాయి వీరిది అతి నిరుపేద కుటుంబం ఈ విషయం తెలిసి స్పందించిన మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోలగాని సమ్మక్క కుటుంబానికి కొంత నగదును   అందచెయ్యడం జరిగింది....ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు... ఉపాధ్యక్షులు మంగి మల్లికార్జున్ యాదవ్... ట్రస్ట్ సభ్యులు P జగన్ మోహన్... చిందుకూరి రామారావు... మెడికల్ షాప్ సురేష్... గ్రామ పెద్దలు గుండి శరత్... వేల్పుల రవికుమార్... కనితి ప్రవీణ్... తదితరులు పాల్గొన్నారు.








Post a Comment

కొత్తది పాతది