పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ : శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడి రెక్కల నరసింహారావు(60) అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. రోజు కళ్ళ ముందు కనిపించే నరసింహారావు మృతి చెందిన వార్త వినగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పై మృతుడి పెద్ద కుమారుడు కోడి రెక్కల స్వామి, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఏడూల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి... ఈ ఘటనకు సంబంధించిన కారకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు ఎస్సై రాజ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తనదైన శైలిలో విచారణ చేసి కొన్ని గంటల్లోనే కేసుని చేధించారు. యాక్సిడెంట్ చేసిన వారిని గుర్తించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా..... కోడి రెక్కల నరసింహారావు శనివారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో మండలంలోని ఎల్చి రెడ్డి పల్లి గ్రామానికి కాలినడకన వెళ్తుండగా..... మణుగూరు వైపు నుంచి పోలిశెట్టి నాగరాజ్(27) అనే డ్రైవర్ పాల వ్యానుతో అతివేగంగా వచ్చి నరసింహారావు వెనక వైపు ఢీకొనగా... తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారని ఎస్సై రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏది ఏమైనాప్పటికీ ఎస్ఐ రాజ్ కుమార్ కొన్ని గంటల్లోనే
పట్టు వదలని విక్రమార్కుడిలా కేసును ఛేదించడం అభినందనీయం అని చెప్పాలి. తన దృష్టికి వచ్చిన ఏ కేసు అయినా చేదించడంలో.. చాణక్యుడి వలె దిట్ట అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. శభాష్ ఎస్సై రాజకుమార్... రక్షకబటులు అంటే ప్రజలకు అండదండ అని ఎస్సై రాజకుమార్ నిరూపించారు.
ఇది కూడా చదవండి...
إرسال تعليق