ములుగు ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సాధారణంగా ఎవరైనా నీళ్ల కోసం బోరు తీస్తే... కొందరికి తక్కువ లోతులోనే నీళ్లు పడతాయి. మరికొందరికి ఎక్కువ లోతులో నీళ్లు పడతాయి. కొన్ని స్థలాల్లో ఎంత లోతు తోడినా.. నీళ్లు పడని సంఘటన కూడా మనం చూశాం. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే... ములుగు జిల్లా ఏటూరునాగారం అడవి సమీపంలో.. ఓ రైతు పొలంలో నీళ్ల కోసం బోర్ వేపిస్తే కొన్ని అడుగులు తీసిన తర్వాత మోటర్ సహాయం లేకుండానే బోర్ లోంచి ఏకధాటిగా నీళ్లు పైకి రావడం మొదలయ్యాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ తథంగం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట. రైతు ఆనందానికి హద్దులు లేవు. రైతుకి బంగారు బాతు దొరికినంత పని అయిందని చెప్పాలి. ఏంచక్కా రెండు పంటలు వేసుకుంటున్నారు. దీనివల్ల చుట్టుపక్కల రైతన్నల పంట కూడా పండింది. కొన్ని సంవత్సరాలుగా బోర్లోంచి స్వయంగా నీరు రావడం మొదలై... ఈ రోజు వరకు ఆగలేదు. తెలియని వారికి ఈ విషయం గురించి తెలిస్తే ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మరి మీరు చూశారా ఈ. వింతని?
إرسال تعليق