జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలు

encounterbulletnews
By -
0

 ఆశ్వాపురం ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలు పురస్కరించుకొని అశ్వాపురం పోలీస్ లు అశ్వాపురం ప్రధాన రహదారి వెంట ఆటో వాహన దారులతో కలిసి ర్యాలీ చేసారు. అశ్వాపురం చౌరస్తా లో సీఐ అశోక్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ... ప్రతి వాహన దారుడు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కలిగి ఉండాలని, సేఫ్టీ తో ప్రయాణించాలని అన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ఎవ్వరికీ ప్రమాదం జరుగదన్నారు... వాహన దారులు మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయవద్దన్నారు. రోడ్డు పై పార్కింగ్ చేసేటప్పుడు కూడా ట్రాఫిక్ జాం కాకుండా మీ వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.. ప్రతి వాహన దారుడు తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.. మితి మీరిన వేగం ప్రమాదకరమన్నారు.. మీ పై ఆధార పడ్డ మీ కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని వాహనాలు నడపాలన్నారు. కార్యక్రమం లో ఆయనతో పాటు ఎస్ ఐ రవుఫ్,పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్ లు, వివిధ వాహనదారులు పాల్గొన్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)