ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రాజీవ్ యువవికాసం పథకంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు లోన్లు అందజేస్తామని తెలిపారు.
ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ముగిసిందన్నారు. తొలి విడతలో భాగంగా జూన్ 2న లక్ష మందికి లోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.
తొలి విడతా జాబితాలోని లక్ష మందిలో హైదరాబాద్ నుంచి 9,219 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని భట్టి చెప్పుకొచ్చారు
వీరిలో 3,721మంది రూ.50 వేల రుణాలు మంజూరు చేయనున్నారు. మిగతా 5,498 మందికి రూ.లక్ష లోన్లు అందజేస్తారు. వీరందరికి జూన్ 2న డబ్బులు అందజేస్తామని భట్టి తెలిపారు.
రాజీవ్ యువవికాసం పథకం కింద హైదరాబాద్ నగరం నుంచి మొత్తం 1,28,763 దరఖాస్తులు వచ్చాయని భట్టి వెల్లడించారు. వీటి వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకర్లకు అందజేశారు.
అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. వారి నుంచి అర్హులను ఎంపిక చేశారు. ఇలా అప్లై చేసుకున్న వారిలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అప్లై చేసుకున్న వారికి జూన్ 2 నిధులు మంజూరు చేస్తామని భట్టి తెలిపారు.
అలానే రూ.2 లక్షల లోపు వారికి జులైలో, రూ.2-రూ.4 లక్షల వరకు ఉన్నవారికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో లోన్లు అందజేయనున్నట్టు చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం.. 2025లో మార్చి 15న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతను అందించేందుకు సుమారు రూ.6వేల కోట్లతో ఈ స్కీమ్‌ను అమలు చేయనుంది.
రేవంత్ సర్కార్ ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది పైగా దీనికి అప్లై చేసుకున్నారు.
వీరిలో అర్హులైన వారిలో నుంచి.. జూన్ 2 తొలి విడత లక్ష మందికి రూ.50 వేలు, రూ.లక్షలోపు యూనిట్ల ప్రాసీడింగ్ మంజూరు చేయనున్నారు.
జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత లబ్దిదారులకు జూన్ 10-15 వరకు ట్రైనింగ్ ఇస్తారు.
అనంతరం జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభత్సవాలు ఉంటాయన్నారు అధికారులు.
إرسال تعليق