జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ
40 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం 40 మంది జర్నలిస్టు లకి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు.
సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు సమస్యకి చెక్ పెట్టారు.
జర్నలిస్టుల పట్టాలు పంపిణీ చేయడంతో జర్నలిస్టులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో ఇంకా ఇళ్ల స్థలాలు రానీ జర్నలిస్టుల సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.ఇతర మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆర్డిఓ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అక్కడి ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నాతోపాటు నియోజకవర్గ అభివృద్ధిలో మీకు బాధ్యత ఉందని ప్రజా సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని జర్నలిస్టులకు చెప్పారు.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని అన్నారు.ఇళ్ల పట్టాలు పొందుతున్న జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆర్డీవో, ఎమ్మార్వో, ఇతర ముఖ్య నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق