పోడు భూముల సమస్యపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేసిన మోతే గ్రామస్తులు

encounterbulletnews
By -
0


*పోడు భూముల సమస్యపై పినపాక ఎమ్మెల్యే శ పాయం వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రాన్ని అందజేసిన మోతే గ్రామ రైతులు..*

*వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..*

కరకగూడెం, జనవరి 08 , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;





 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మోతే గ్రామానికి చెందిన వ్యవసాయ రైతులు గురువారం పోడు భూమి సమస్యపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యను విన్నపించారు గత 35 సంవత్సరాల నుండి 40 కుటుంబాలు కలిసి సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ భూమి,సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఈ భూమి రెండు పంటలు పండుతుందని ఈ భూమిలో కరెంటు సౌకర్యం మరియు బోరులు ఉన్నాయని ఈ భూమి ఫారెస్ట్ భూమి అంటూ గత కొంత కాలం నుండి బీట్ ఆఫీసర్స్ ఇబ్బందికి గురి చేస్తున్నారని మాపై దయవుంచి ఫారెస్ట్ ఆఫీసర్లు మా జోలికి రాకుండా చూడాలని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేశారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంబంధిత ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు..మీకు ఎటువంటి సమస్య వచ్చిన అండగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు..ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి మోతే రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..

 ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)