మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ముమ్మరంగ వాహన తనిఖీలు
మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండలం లోని జానంపేట శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని ఈ బయ్యారం ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. తనిఖీల్లో లో భాగంగా అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానిత అపరిచిత వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరూ కూడా మావోయిస్టు కార్యక్రమాలకు సహకరించవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి