ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసన

 ఫీజు రీయంబర్సమెంట్ కోసం నిరసన.

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్సమెంట్,వసతి గృహాల మెస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సంఘం శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల ముందు నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నామాత్కర్ నవీన్ మాట్లాడుతూ తెలంగాణ విద్యారంగం సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచి ప్రభుత్వం పెండింగ్ ఫీజు రియాంబర్స్ మెంట్ ,మెస్ ఛార్జీలు,విడుదల చేస్తూ విద్యా సంస్థలకు సొంత భవనాలను సమకూర్చలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వికాస్ అంకిత్ ఓంకార్ ఆకాష్ సిద్దు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

కొత్తది పాతది