ఎస్పీ చేతుల మీదుగా కఠిన సేవ పథకం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు

G Rajashekar
By -
0




EB NEWS/పినపాక:


 పినపాక మండలం ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు కఠిన సేవ పథకాన్ని అందుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా సీఐ వెంకటేశ్వర్లు ఈ పథకాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, పోలీస్ శాఖకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ పథకాన్ని అందజేశారు. కఠిన పరిస్థితుల్లోనూ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సీఐ వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సీఐ వెంకటేశ్వర్లును అభినందించారు. ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందడం పట్ల సీఐ వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని సీఐ వెంకటేశ్వర్లుకు అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)