అర్ధరాత్రి గోదావరిలో దూకిన యువకుడు... బ్రతికి బయట పడ్డాడు

G Rajashekar
By -
0

 


అర్ధరాత్రి యువకుడి ప్రాణాలు కాపాడిన పట్టణ నూతన సీఐ సట్ల రాజు


ఏరియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్ తరలింపు


EB NEWS/భద్రాచలం:


గత రాత్రి భద్రాచలం - సారపాక మధ్య గల బ్రిడ్జి నుంచి ఒక యువకుడు దూకగా... గురువారం తెల్లవారుజామున ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. వివరాలలోకి వెళితే... దుమ్ముగూడెం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన జంపన్న అనే 20 సంవత్సరాల గల యువకుడు మద్యం మత్తులో బ్రిడ్జిపై నుంచి గోదావరిలో నదిలోకి దూకాడు.


 అదృష్టవశాత్తు బండరాళ్లు ఏమి తగలకుండా నీళ్లలో పడ్డాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన జంపన్న గోదావరి ఉధృతికి కొట్టుకువెళ్లి మధ్యలో గల ఇసుక దీవిలో ఆగాడు. సుమారు రాత్రి రెండు గంటల సమయంలో మెలుకువ వచ్చి బిగ్గరగా అరుస్తుండగా.. చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సిఐ సట్ల రాజు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాడు కరుకు ప్రసాద్ సహాయంతో యువకుడిని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. చికిత్స కొరకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కు తరలించగా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 


యువకుడి మరల ఏమైన అఘాయిత్యానికి పాల్పడతాడనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు రాగానే కౌన్సిలింగ్ ఇచ్చి పంపనున్నట్లు సిఐ సట్ల రాజు వెల్లడించారు. అర్ధరాత్రి అయినా సమయస్ఫూర్తితో క్షణాలు వ్యవధిలో స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకున్న సీఐ రాజును పలువురు ప్రశంసించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)