కరెంట్ బిల్లులు,డీమార్ట్ రిసిప్ట్ ల తో జాగ్రత్త... చేతితో తాకితే రోగాలు వచ్చే ప్రమాదం'.. కరీంనగర్ డాక్టర్ హెచ్చరిక

G Rajashekar
By -
0

 

EB NEWS/TELANGANA:

 కరెంట్ బిల్లులు, ఏటీఎం రిసీప్ట్స్, డీమార్ట్ లాంటి స్టోర్లలో ఇచ్చే బిల్లులతో జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ సింగ్ థాకూర్ హెచ్చరిస్తున్నారు. ఈ రిసీప్టులను చేతులతో తాకితే.. బీపీ, షుగర్ రావడం.. పిల్లలు పుట్టకపోవడం.. హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ బారిన పడటం లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని థర్మల్ పేపర్ అంటారని.. ఇందులో బీపీఏ, బీపీఎస్ కెమికల్స్ ఉంటాయని.. వీటిని ఎప్పుడో ఒకసారి ముట్టుకుంటే పైన చెప్పిన సమస్యలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు కానీ.. తరచుగా చేతులతో తాగుతున్నట్లయితే ఈ సమస్యలు వస్తాయని డాక్టర్ తెలిపారు.


 క్యాషియర్లు, బిల్లింగ్ ప్రక్రియలో పని చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నైట్రైల్ గ్లోవ్స్‌ను చేతులకు తొడుక్కోవాలని డాక్టర్ విక్రాంత్ సూచించారు. శానిటైజ్ చేసుకోవడం వల్ల ఈ కెమికల్స్ శరీరంలోకి తొందరగా అబ్జార్వ్ అవుతాయని.. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ బిల్లులను పిల్లల చేతికి ఇవ్వొద్దని డాక్టర్ విక్రాంత్ సూచించారు.


థర్మల్ పేపర్ రసీదుల్లో ఉండే బీపీఏ లేదా బీపీఎస్ లాంటి రసాయనాలు శరీరంలోని హార్మోన్లను దెబ్బతీస్తాయి. ఈ రసీదులను చేతులతో తాకినప్పుడు వాటిలోని రసాయనాలు చర్మానికి అంటుకుంటాయి. చేతులకు శానిటైజర్ రాసుకున్నా లేదా చేతులు తడిగా ఉన్నా ఇవి చర్మంలోకి వేగంగా ఇంకుతాయి. క్యాషియర్లు, బిల్లింగ్ సిబ్బంది నిత్యం రోజంతా ఈ బిల్లులను పదే పదే పట్టుకుంటారు. కాబట్టి వారికి ఈ రసాయనాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సూపర్ మార్కెట్లలో థర్మల్ పేపర్ రిసీప్ట్స్ తీసుకోవడానికి ఈ-రిసీప్ట్స్ తీసుకోవడం ఉత్తమం. నైట్రైల్ గ్లోవ్స్ లాంటి సింథటిక్ గ్లోవ్స్‌ను రోజంతా చేతులకు ధరించలేని వారు.. కాటన్ గ్లోవ్స్ వేసుకోవచ్చు. అయితే వీటిని తడవకుండా చూడటంతోపాటు.. క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి..


 డాక్టర్ విక్రాంత్ గురించి..


 కరీంనగర్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ విక్రాంత్ సింగ్ థాకూర్ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీపీ, షుగర్ లాంటి జీవన శైలి వ్యాధుల నివారణ గురించి ఆయన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)