బ్రేకింగ్ న్యూస్: 14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్....

G Rajashekar
By -
0

 


EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:


చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ హాస్టల్‌లో వార్డెన్ భూక్యా వాల్ సింహ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హాస్టల్‌లో కుక్‌కు జీతం చెల్లించే విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. 


మారుమూల ప్రాంతాల నుంచి సైతం ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వ సేవల్లో లంచాల డిమాండ్‌పై బాధితులు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)