EB NEWS/ మేడ్చల్:
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై.. ఆదేశాలిచ్చిన సీఐపై ఏసీబీ చర్యలు
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఓ కేసులో బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసి వేధించిన సీఐ ఆంజనేయులు, ఆయన ఆదేశాల మేరకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది.

