EB NEWS/మణుగూరు:
పట్టణంలో సంచలనం సృష్టించిన సింహాద్రి శివ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం **27 మంది నిందితులు** ఉండగా, ఇప్పటికే 23 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన నలుగురు నిందితుల్లో **శివరాత్రి సాంబశివరావు, పూణెం నాగేంద్రబాబు, చాతబోలు ఏసు, వల్లపు మల్లికార్జున** ఉన్నారు.
పరారీలో ఉన్న నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు **మణుగూరు సీఐ పాటి నాగబాబు** ప్రకటనలో వెల్లడించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో మొత్తం 27 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
శివ హత్య కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. తాజాగా నలుగురు నిందితులు పట్టుబడటంతో కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

