మణుగూరు: కాలుష్యం కోరల్లో పరిసర గ్రామాలు.

G Rajashekar
By -
0


  EB NEWS/పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం - మణుగూరు మండలాల సరిహద్దులో నిర్మించిన బిటిపిఎస్ మొదలైన ప్రారంభ రోజుల్లో పరిసర గ్రామ ప్రజల మనసుల్లో ఎన్నో ఆశలతో, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే కోరికతో, భూమిని త్యాగం చేసిన రైతు కుటుంబాల్లో ఉద్యోగ ఆశలతో తమ జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరికలతో మొదలైంది. కానీ నేడు బి టి పి ఎస్ అనే పరిశ్రమ వారి పాలిట విషపు వలయంగా, కాలుష్యమైన దైనందిన జీవితాన్ని ప్రసాదంగా అందించింది. అనేకమార్లు ఉన్నతాధికారులతో, వాతావరణ కాలుష్య మండలి కమిటీకి ప్రభావిత గ్రామ ప్రజలు ,యువత ఫిర్యాదు చేయడం జరిగింది. పొల్యూషన్ బోర్డుకు కాలుష్యంపై ఫిర్యాదు చేయగా దానికి స్పందనగా పొల్యూషన్ బోర్డు హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో పొల్యూషన్ బోర్డు వారే బి టి పి ఎస్ సీఈవో బిచ్చన్న నాయక్ కి కాలుష్య స్థాయిలు భయంకరంగా, ప్రమాదకరంగా ఉన్నాయని స్పష్టంగా తెలిపారు. దానికి సీఈఓ "రెండు నెలల్లో కాలుష్యాన్ని అదుపులోకి తెస్తాం" అని హామీ ఇచ్చారు. కొన్ని రోజులు కాలుష్యం తగ్గినట్టు అనిపించినా, ఇటీవలి రోజుల్లో కాలుష్యం ఇంతకుముందు కంటే కూడా భారీగా పెరిగిపోతోంది. పొల్యూషన్ బోర్డు హెచ్చరించినా, సీఈఓ హామీ ఇచ్చినా ఫలితం శూన్యం. ఇక పరిసర ప్రభావిత గ్రామాల్లోని ప్రజలు యువత మరింత చైతన్యంతో ఉంటే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పు రాదని, ఈ పరిస్థితిపై ఏం చేయగలమో అందరం కలిసి ఆలోచించాలనీి తదుపరి కార్యాచరణ కోసం అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని దృఢ నిశ్చయంతో, భవిష్యత్తు తరాల కైనా కాలుష్య రహితమైన వాతావరణాన్ని అందించే ఉద్దేశంతో త్వరలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు యువత ఒక కార్యాచరణను సిద్ధం చేసుకోబోతున్నట్లు తెలిసింది. ప్రజల కష్టాలను తెలుసుకొని పరిశ్రమ అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకుంటారో లేదో వేచి చూడాలి మరి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)