EB NEWS/అశ్వాపురం:
ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)లో భారీగా తేడాలు గుర్తించిన నేపథ్యంలో అశ్వాపురానికి చెందిన ఓ రైస్‌మిల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇటీవల సదరు రైస్‌మిల్‌లో తనిఖీలు నిర్వహించగా ధాన్యం, సీఎంఆర్‌లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు ఆదివారం అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు రైస్‌మిల్ యజమానిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ సిరివేరు ఎల్లయ్య తెలిపారు.
*రూ.2.68 కోట్ల మేర తేడా?*
రైస్‌మిల్‌లో ధాన్యం, సీఎంఆర్‌కు సంబంధించిన తేడా విలువ సుమారు రూ. *2.68 కోట్లు ఉన్నట్లు* సమాచారం. అయితే ఈ మొత్తం అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

