EB NEWS/మణుగూరు:
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుతో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, పనులు, ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పాయం సవాల్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

