మణుగూరులో రోడ్డు ప్రమాదం..పినపాక వ్యక్తికి తీవ్ర గాయాలు

G Rajashekar
By -
0

 


మణుగూరు/EB NEWS:

 మణుగూరు మండలంలోని తిర్లాపురం గ్రామం వద్ద శనివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పినపాక మండలం జానంపేటకు చెందిన టాపి మేస్త్రీ కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి.


ప్రమాద తీవ్రతకు కోటేశ్వరరావు అక్కడికక్కడే స్పృహ కోల్పోయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)