పినపాక: అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో తండ్రి.. దాతల సాయం కోసం కొడుకు వేడుకోలు

G Rajashekar
By -
0




EB NEWS/పినపాక:


 విధి ఆ కుటుంబాన్ని వరుస విషాదాలతో కుంగదీస్తోంది. పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన వెన్నెల ఈశ్వరయ్య (48) గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికే కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండగా.. వైద్యం కోసం అయ్యే ఖర్చు నిరుపేద కుటుంబానికి భారంగా మారింది.


కొన్ని నెలల క్రితమే ఈశ్వరయ్య భార్య మృతి చెందడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు ఈశ్వరయ్య అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. దీంతో తండ్రి పరిస్థితిని చూసి కుమారుడు సురేష్ కన్నీటి పర్యంతమవుతున్నాడు.


తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక సాయం అవసరమని, దాతలు, మానవతావాదులు స్పందించి తమ కుటుంబానికి అండగా నిలవాలని సురేష్ వేడుకుంటున్నాడు. **చిన్న సాయం అయినా తమ తండ్రి ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని** ఆయన కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నాడు.


ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటాలని స్థానికులు కోరుతున్నారు.


సహాయం అందించిన ఫోన్ పే నెంబర్  : 9160078835


 మీరు చేసే చిరు సహాయమే ఒక ప్రాణం నిలబడేయడానికి సహాయపడవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)