అశ్వారావుపేటలో వినూత్న ఆఫర్.. గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలరోజులు ఫ్రీ టిఫిన్!

G Rajashekar
By -
0

 


EB NEWS/అశ్వారావుపేట:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ హోటల్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గ్యాస్ సిలిండర్ల కొరతతో పలుచోట్ల హోటళ్లు మూతపడుతున్న పరిస్థితుల్లో, ఈ యజమాని వినూత్నంగా ఆలోచించి కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించాడు.


హోటల్ ముందు ఏర్పాటు చేసిన బ్యానర్‌లో “గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలరోజులు ఉచితంగా టిఫిన్ అందిస్తాం” అని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కస్టమర్లు తమ వద్ద ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఇవ్వగా, దానికి సరిపడ డబ్బు చెల్లించి ఖాళీ బండను తిరిగి ఇస్తామని, అలాగే ఒక నెల పాటు ఉచితంగా టిఫిన్ అందిస్తామని యజమాని తెలిపారు.


గ్యాస్ సంక్షోభం కారణంగా వ్యాపారం నడపడం కష్టంగా మారడంతో ఈ విధమైన ఆఫర్ ప్రకటించినట్లు హోటల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విచిత్రమైన ఆఫర్ ప్రస్తుతం స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)