ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

G Rajashekar
By -
0

 


EB NEWS/మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు మండలం పరిధిలోని తోగ్గుడెం గ్రామానికి చెందిన అంకాల హైమావతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా నూతన గృహాన్ని నిర్మించుకుని ఈరోజు గృహప్రవేశ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన గృహంలో పూజా కార్యక్రమంలో పాల్గొని, హైమావతి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా కృషి కొనసాగుతుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


ఈ కార్యక్రమంలో MRO నరేష్, MPO (ఎంపీడీవో, ఇంచార్జ్) వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, సర్పంచ్ మడకం క్రిష్ణ, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)