EB NEWS/పినపాక:
పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ వద్ద మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సురేష్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ మైసూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు మరియు తదిఇతరులు పాల్గొన్నారు.

