మరోసారి మానవత్వం చాటుకున్న ఎస్ఐ రాజ్ కుమార్

G Rajashekar
By -
0



EB NEWS/కరకగూడెం:


ఆపదలో ఉన్నామని తెలిసిన వెంటనే "నేనున్నాను" అంటూ ముందుకు వచ్చే పాకాల కొత్తగూడ ఎస్సై రాజ్‌కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణలో కఠినంగా ఉండే ఆయన, సేవా కార్యక్రమాల్లో మాత్రం హృదయపూర్వకంగా స్పందిస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.


కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన గోగు రజిత   చిన్నారి తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా ఎస్సై రాజ్‌కుమార్ దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ఆయన, ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని తన వంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సాయం అందించారు.


గతంలో కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన సమయంలోనే స్థానిక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ‘మంచి మనసున్న మారాజు’గా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్, మరోసారి అదే మానవత్వాన్ని నిరూపించారు.


ప్రజల ప్రశంసలు:

సంతోష సమయంలో కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఎస్సై రాజ్‌కుమార్ తన చర్యతో చూపించారు. ఆయన అందించిన సహాయం బాధిత కుటుంబానికి కొండంత ధైర్యం ఇచ్చింది.


పోలీస్ అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యత కూడా అని చాటిచెప్పిన ఎస్సై రాజ్‌కుమార్‌పై స్థానిక ప్రజలు, సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)