పినపాకకు కొత్త తహసీల్దార్ బాధ్యతలు స్వీకారం

 


EB NEWS/పినపాక: 


పినపాక మండల నూతన తహసీల్దార్‌గా జీ. శ్రీనివాస్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.


బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా చేరేలా కృషి చేస్తానని తెలిపారు. రెవెన్యూ సేవలను వేగవంతంగా అందించి, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


మండల అభివృద్ధికి సహకారం అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 


Post a Comment

أحدث أقدم