EB NEWS/మణుగూరు:
మణుగూరు పట్టణంలోని సినిమా హాల్ సెంటర్‌లో బుధవారం బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పినపాక మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ... పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యాలయం కేంద్రంగా పని చేస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

