అశ్వాపురం: గిరిజన గురుకుల విద్యార్థికి రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి

G Rajashekar
By -
0




EB NEWS/అశ్వాపురం :


అశ్వాపురం  మండలం మిట్టగూడెం తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలుర కళాశాలకు చెందిన విద్యార్థి పి. హేమంత్ (మూడవ సంవత్సరం బీకాం CA) రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన “MY BHARATH Budget Quest” కార్యక్రమంలో హేమంత్ మొదటి స్థానం సాధించి ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకున్నాడు.


ఈ విజయానికి కళాశాల ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి మరియు అధ్యాపకుల మార్గదర్శకత్వం ఎంతో దోహదపడిందని హేమంత్ పేర్కొన్నాడు. విద్యా జీవితంలో ఈ ఘనత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.


హేమంత్ సాధించిన ఈ విజయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మిట్టగూడెం కళాశాలకు గౌరవం తీసుకువచ్చింది.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)