మణుగూరు సింగరేణిలో టిప్పర్ దగ్ధం.. ఎండ తీవ్రతే కారణమా?

G Rajashekar
By -
0

   


EB NEWS/మణుగూరు:


మణుగూరు సింగరేణి ఏరియాలోని కొండాపురం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లోడింగ్ కోసం వెళ్లిన ఓ టిప్పర్ వాహనం సుమారు రెండు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


ఈ ఘటనను గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో టిప్పర్ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఎండ తీవ్రత కారణంగా వాహనం దగ్ధమై ఉండొచ్చని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)