పినపాక:ప్రాణాపాయంలో సమ్మక్క.. దాతల సహాయం కోసం కుటుంబం వేడుకోలు

G Rajashekar
By -
0




EB NEWS/పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన గుండారపు సమ్మక్క(52) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆమె వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


నిరుపేద కుటుంబానికి చెందిన సమ్మక్కకు వైద్యం చేయించుకోవడానికి అవసరమైన డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ కూలి పనికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి ఉండటంతో ఖరీదైన వైద్య ఖర్చులను భరించడం అసాధ్యంగా మారింది.


ఈ నేపథ్యంలో దయగల హృదయం కలిగిన దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని సమ్మక్క కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మీ చిన్న సహాయం కూడా ఆమె ప్రాణాలను కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుంది.సహాయం అందించవలసిన ఫోన్‌పే నంబర్:** 8074759552


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)