రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బంద్ ప్రారంభం.. ప్రయాణికులకు ఇబ్బందులు

G Rajashekar
By -
0

 



EB NEWS/తెలంగాణ:


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బంద్ బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు డిపోలలో బస్సులు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల నుంచి నగరాలకు, నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలు దాదాపు స్థంభించాయి.


నిన్న ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.


ఇవాళ డిపోల ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు సమాచారం.



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)