Telangana RTC Strike 2026: ఇవాళ బస్సులు ఆగిపోయిన కారణాలు ఇవే

G Rajashekar
By -
0

 


EB NEWS/తెలంగాణ:

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు ఇవే!

1. ప్రభుత్వ మేనిఫెస్టోలోని వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలి 

2. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి 

3. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి. 2017 నుంచి అలవెన్సులు పెంచాలి 

4. 2021 నాటి పే రివిజన్ (30% ఫిట్‌మెంట్) అమలు చేయాలి

5. కొత్త బస్సులు కొనాలి. వర్క్ షాపులను బలోపేతం చేయాలి

6. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం టేకోవర్ చేయాలి. బడ్జెట్‌లో 3% కేటాయించాలి,8 గంటల షిఫ్ట్ అమలు చేయాలి.



నష్టం ఎవరికి?


సామాన్య ప్రజలు (ప్రయాణికులు): ప్రతిరోజూ సుమారు 60 లక్షల మంది బస్సులపై ఆధారపడతారు. సమ్మె వల్ల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించి, గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడతారు.

మహిళలు: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం (మహాలక్ష్మి పథకం) నిలిచిపోవడంతో, ప్రైవేటు వాహనాల్లో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రయాణించాల్సి వస్తుంది.

విద్యార్థులు & ఉద్యోగులు: సమయానికి ఆఫీసులు, కాలేజీలకు వెళ్లలేక ఇబ్బంది పడతారు.

ప్రభుత్వం: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. ఆర్టీసీ సంస్థ భారీ ఆదాయాన్ని కోల్పోతుంది. 

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)