పినపాక నియోజకవర్గంలో నిరంతర విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

G Rajashekar
By -
0

 



EB NEWS/మణుగూరు:


🔹మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 


🔹ఈ సందర్భంగా *ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.


🔹రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తోందని, ఎండాకాలంలో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


🔹గాలివానల వల్ల చెట్లు విరిగి పడటం లేదా విద్యుత్ వైర్లు తెగిపోవడం వంటి సమస్యలు ఎదురైతే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.


🔹విద్యుత్ లైన్ల నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు ఉదయం 10 గంటలలోపే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తీవ్ర ఎండల కారణంగా మధ్యాహ్నం వేళల్లో విద్యుత్ నిలిపివేస్తే వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడే అవకాశముందని, అందుకే పనుల సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలని అధికారులకు ఆదేశించారు.


🔹నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఏఈలు, ఏడీఈలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.


🔹ఈ సమావేశంలో భద్రాచలం డివిజన్ విద్యుత్ శాఖ డి.ఈ. జీవన్ కుమార్, ఏ.డి.ఈ. ఉమామహేశ్వరరావు, ఏ.డి.ఈ. లారెన్స్ మరియు వివిధ మండలాల ఏ.ఈలు పాల్గొన్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)