పోషించలేక పసికందు అమ్మకం.. మానవత్వాన్ని కదిలించిన ఘటన

G Rajashekar
By -
0



EB NEWS/నిజామాబాద్:


తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో ఆడ శిశువును అమ్మిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.


నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన కిస్టవ్య అనే మహిళకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, నాల్గవ సంతానం కూడా ఆడపిల్లగా పుట్టింది. ఆర్థిక ఇబ్బందులు, పోషణ సమస్యల కారణంగా 18 రోజుల పసికందును బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన అనురాధకు రూ.1 లక్షలకు విక్రయించింది.


ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. శిశువు భద్రతపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఆడ శిశువులపై జరుగుతున్న వివక్షపై మరోసారి చర్చ మొదలైంది.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)