ఏకలవ్య స్కూల్లో ఫుడ్ పాయిజన్ భయం.. 60 మంది విద్యార్థులు ఆసుపత్రి బాట

 


EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనంగా అందించిన చికెన్ తిన్న అనంతరం సుమారు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.


విద్యార్థులకు వాంతులు, వాంతుల భావం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే స్కూల్ సిబ్బంది అప్రమత్తమై ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించిన 30 మంది విద్యార్థులకు పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ దివాకర్ చికిత్స అందించారు. వీరిలో నలుగురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండటంతో వారిని సత్తుపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్కూల్‌ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటన గురించి సమాచారం ఆలస్యంగా అందిందని ప్రిన్సిపాల్‌తో పాటు స్కూల్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, విద్యార్థులకు అందించిన ఆహారం కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.



Post a Comment

أحدث أقدم