భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించిన జిల్లా కలెక్టర్ అంకిత్



EB NEWS /భద్రాచలం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్‌కు దేవస్థానం ఈవో దామోదర్ రావు, అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.


ముందుగా బలిపీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిలో స్వామివారికి దర్శనం చేసుకున్నారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారు మరియు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని ప్రార్థనలు చేశారు.


ఈ సందర్భంగా అర్చక స్వాములు కలెక్టర్‌కు స్వామివారి పట్టు వస్త్రాలు అందజేసి ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు.


ఈ కార్యక్రమంలో భద్రాచలం తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم