ఇల్లందు దర్గాలో ‘రామయ్య లీల’.. ఫలహారం తిన్న ఉడుత.. చూసి భక్తుల ఆశ్చర్యం!

G Rajashekar
By -
0

 


EB NEWS/ఇల్లందు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం 1వ వార్డు సత్యనారాయణపురంలో ఉన్న హజరత్ నాగుల్ మీరా దర్గాలో భక్తి, సామరస్యానికి నిదర్శనంగా విశేష ఘటన చోటుచేసుకుంది. దర్గాలో దమ్మక్క విగ్రహ ప్రతిష్ఠతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను హిందూ–ముస్లింలు కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు.


ఈ వేడుకల్లో భాగంగా రాములోరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫలహారాలను ఓ ఉడుత వచ్చి భుజించడం అక్కడి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ వేడుకల్లో ఇదే విధంగా ఉడుత వచ్చి ఫలహారం స్వీకరిస్తుందని స్థానికులు చెబుతున్నారు.


దీనిని భక్తులు “రామయ్య లీలా”గా భావిస్తూ ఆ ఉడుత రాకను పవిత్ర సూచికగా తీసుకుంటున్నారు. హిందూ–ముస్లింల ఐక్యత మధ్య ఈ ఘటన మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.


ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


LOCAL AD:





إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)