EB NEWS/ఖమ్మం:
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగు చెరువులో ఒక విచిత్రమైన చేప కనిపించడం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. గ్రామానికి చెందిన బొడ్డు పెరమయ్య చెరువులో చేపలు పట్టే క్రమంలో వల వేసాడు. అయితే వలలో సాధారణంగా కనిపించే చేపలతో పాటు ఒక విచిత్ర ఆకారంలో ఉన్న చేప పడడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఇంతవరకు ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని పెరమయ్య తెలిపారు. చేప ఆకారం, రంగు భిన్నంగా ఉండటంతో గ్రామంలో ఈ విషయం వేగంగా వ్యాపించింది. దీంతో ఆ చేపను చూడటానికి గ్రామస్థులు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు.
అయితే ఈ చేప ఏ జాతికి చెందినది అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. దీనిపై మత్స్యశాఖ అధికారులు లేదా నిపుణులు పరిశీలిస్తే అసలు వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన చేప గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి