EB NEWS/తెలంగాణ:
వంట నూనె ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇటీవల ఆన్లైన్ మార్కెట్లో సన్‌ఫ్లవర్ నూనె లీటర్ ధర రూ.152గా ఉండగా, ప్రస్తుతం అది రూ.174 నుంచి రూ.178 వరకు చేరింది. అదే సమయంలో ఆఫ్లైన్ మార్కెట్లో కూడా లీటర్ సన్‌ఫ్లవర్ నూనె రూ.165 నుంచి రూ.168 మధ్య విక్రయిస్తున్నారు.
పల్లీ నూనె ధరలు మరింత పెరిగి లీటర్‌కు రూ.220 దాటాయి. ధరలు పెరగడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ కావడంతో సరఫరా తగ్గింది. దీంతో పలు సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో ‘నో స్టాక్’ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగితే నూనె దిగుమతులు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

إرسال تعليق