మణుగూరు: ఇజ్రాయిల్–అమెరికా దాడులు నిలిపివేయాలని డిమాండ్

G Rajashekar
By -
0

 


EB NEWS/మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులను తక్షణమే నిలిపివేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు భారం అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలను తగ్గించి ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)