నిలబడే చోటు లేకుండా ప్రయాణం – నిత్య సమస్యగా మారిన రద్దీ

G Rajashekar
By -
0



EB NEWS/ తెలంగాణ:


 పరిమితికి మించి ప్రయాణికులు – RTC బస్సుల్లో నిత్య సమస్య


రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో RTC బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్స్ సమయంలో బస్సుల్లో కిక్కిరిసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగులు ప్రయాణించడం కష్టసాధ్యంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బస్సుల్లో నిలబడే స్థలం కూడా లేకుండా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరమని తెలిసినా, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు దిగేందుకు కూడా అవకాశం లేకుండా బస్సులు నడుస్తున్నాయని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.


“పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కితే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? RTA అధికారులు ఏమి చేస్తున్నారు?” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే అధికారులు, బస్సుల్లో జరుగుతున్న ఈ రకమైన ఉల్లంఘనలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.


ప్రజల భద్రత దృష్ట్యా RTC అధికారులు, RTA విభాగం తక్షణమే స్పందించి బస్సుల్లో ప్రయాణికుల పరిమితిని కచ్చితంగా అమలు చేయాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ అంశంపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా అనే దానిపై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)