పినపాకలో అడవి దినోత్సవ ర్యాలీ.. పచ్చదనానికి పిలుపు

G Rajashekar
By -
0




EB NEWS/ పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ప్రపంచ అడవి దినోత్సవం సందర్భంగా అడవి శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

“పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు” అంటూ నినాదాలు చేస్తూ పరిసరాల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవులు ప్రకృతి సమతుల్యతకు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షించాలని అధికారులు సూచించారు.


ఈ సందర్భంగా అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)